- మాన్యువల్ విధానానికి చెక్
- వసూళ్ల దందాకు చెక్ పెట్టేందుకు ఆర్టీఏ వ్యూహం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో వాహనాల ఫిట్నెస్ఇక పూర్తిగా ఆటోమేటిక్యంత్రాల ద్వారానే నిర్వహించాలని ఆర్టీఏ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో ప్రైవేట్ఆటోమేటిక్వెహికల్టెస్టింగ్ కేంద్రాలను(ఏటీఎస్) ఏర్పాటు చేయనున్నది.
ప్రైవేట్భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఈ టెస్టింగ్స్టేషన్లలో వాహనాల సామర్థ్యాన్ని కచ్చితంగా నిర్ణయించవచ్చని అంటున్నారు.
ఎందుకు మార్పు ?
ప్రతి ఏడాది వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను ఆర్టీఏ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీఏ పరిధిలోని ఆయా జోనల్ ఆఫీసుల్లో మాన్యువల్‌గా వాహనాల ఫిట్నెస్పరీక్షలు నిర్వహిస్తూ సర్టిఫికెట్జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్వెహికల్స్, ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, కమర్షియల్వాహనాలు ఈ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి.
అయితే, కొన్ని కేంద్రాల్లో వెహికల్ఇన్స్పెక్టర్లు వాహనదారుల నుంచి ముడుపులు తీసుకుని ఫిట్‌గా లేకున్నా సర్టిఫై చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్లపై రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో చాలా వరకు వాహనాల ఫిట్నెస్సరిగ్గా లేకపోవడమే కారణమని తేలుతున్నది. దీంతో ఇక నుంచి వాహనాల కచ్చితమైన సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఆటోమేటిక్ వెహికల్ టెస్టింగ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. త్వరలోనే పటాన్చెరు, మేడ్చల్, నాగోల్, కొండాపూర్, ఉప్పల్ తదితర కేంద్రాల్లో ఈ టెస్టింగ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఎలాంటి పరీక్షలు చేస్తారంటే...
ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించే ఈ ఆటోమేటిక్ టెస్టింగ్సెంటర్లలో మానవ ప్రమేయం లేకుండా వాహనాల ఫిట్నెస్ నిగ్గు తేల్చే పరీక్షలు ముఖ్యంగా ఇంజిన్ కెపాసిటీ, వాహనాల బాడీ నాణ్యత, టైర్ల పనితీరు, బ్రేకులు సరిగ్గా ఉన్నాయా లేవా? స్టీరింగ్పనితీరు, హెడ్లైట్స్వంటి వాటిని క్షుణ్ణంంగా చెక్చేస్తారు.
ఆటోమేటిక్ టెస్టింగ్ప్రక్రియ కావడంతో వంద శాతం ఖచ్చితత్వం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీని వల్ల వెహికల్ ఇన్స్పెక్టర్లు వసూళ్లకు పాల్పడే అవకాశం ఉండదంటున్నారు. ఫిట్నెస్ టెస్ట్‌లో వాహనాలు ఫెయిల్అయితే వాహన దారులను మరోసారి టెస్ట్ కు రమ్మని తిప్పి పంపుతారంటున్నారు.
కానీ, మాన్యువల్ టెస్ట్‌లో కొందరు అధికారులు వాహనాలు టెస్ట్‌లో ఫెయిల్అయినా పాస్ అయినట్టు సర్టిఫై చేస్తుంటారు. కొత్త విధానంలో ఇక ఆ పరిస్ధితి ఉండదని అంటున్నారు. వాహనాలు ఫిట్‌గా ఉంటేనే ప్రమాదాలను చాలా వరకు నివారించ వచ్చని అధికారులు చెబుతున్నారు.
ఉత్సాహంగా రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్
సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ 10వ ఎడిషన్ ఉత్సాహంగా సాగింది. 5కె, 10కె, 21కె విభాగాల్లో నిర్వహించిన ఈ రన్‌ను దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కలిసి ప్రారంభించగా, వేలాది మంది నగరవాసులు పాల్గొన్నారు. సేవా భారతి తెలంగాణ జాయింట్ సెక్రటరీ జయప్రద దేవి నేతృత్వంలో జరిగిన ఈ ఈవెంట్లో పలువురు ప్రముఖులు పాల్గొని, ఆడపిల్లల సాధికారతకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.
